సుప్రీంలో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఆదేశం

Remove party colourson govt. buildings-supreme-court

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలని జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. కాగా ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైఎస్‌ఆర్‌సిపి రంగులను తొలగించాలంటూ ఇటీవల హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/