ఏపి హైకోర్టు సీజేగా జస్టిస్‌ మహేశ్వరి

AP High Court
AP High Court

న్యూఢిల్లీ: ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్‌ న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.


తాజా ప్రజావాక్కు వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/editorial