సూర్య నారాయణ స్వామిని తాకిన సూర్య కిరణాలు

9 నిమిషాల పాటు తాకిన కిరణాలు.. పులకించిన భక్తజనం

sun rays touches lord Suryanarayana on arasavalli temple
sun rays touches lord Suryanarayana on arasavalli temple

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి. ఉదయం 6.21 గంటల నుంచి 6.30 గంటల వరకూ తొమ్మిది నిమిషాల పాటు ఆదిత్యునిపై సూర్య కిరణాల ప్రసారం భక్తులను కనువిందు చేసింది. ప్రతి సంవత్సరమూ మార్చి 9, 10 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారిపై నేరుగా పడతాయన్న విషయం తెలిసిందే. కాగా ఈఅద్భుతాన్ని చూసేందుకు భక్తులు గత రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ఇది జరుగుతుంది. ఆపై అక్టోబర్ 1, 2 తేదీల్లోనూ ఇదే అద్భుతం గోచరిస్తుంది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/