స్వామివారి మూల విరాట్‌ను తాకని సూర్యకిరణాలు


నిరాశగా వెనుదిరిగిన భక్తులు
రేపటిపైనే ఆశ

suryanarayana swamy
suryanarayana swamy

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి భక్తులు నేడు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈరోజు స్వామి వారి మూలవిరాట్‌ను తాకాల్సిన సూర్యకిరణాలు మేఘాల కారణంగా ప్రసరించలేదు. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో భానుడి కిరణాలు స్వామి వారి పాదాలను తాకలేకపోయాయి. రేపు కూడా సూర్యుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్‌ను తాకుతాయి. అయితే, ఇందుకు వాతావరణం కరుణించాల్సి ఉంటుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/