కాంట్రాక్టర్ల రద్దుతో ప్రాజెక్ట్ తీవ్ర ఆలస్యo

Amaravati: ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వైసీపీ నేతల తీరుతో రాష్ట్రం నుండి పెట్టుబడిదారులు పారిపోతున్నారన్నారు ఎంపీ సుజనాచౌదరి. అమరావతిలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరుతో పెట్టుబడులు వెనక్కువెళ్ళిపోతున్నాయని, 75 శాతం స్థానికులకే ఉద్యోగాలన్నది రాజ్యాంగ విరుద్ధమన్నారు. పోలవరం కాంట్రాక్ట్ విషయంలో కూడా ప్రభుత్వం తీరు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుందని, కాంట్రాక్టర్ ఎవరన్నది ఇప్పుడు ముఖ్యం కాదని, ప్రాజెక్ట్ పూర్తికావడం రాష్ట్రానికి అవసరమన్నారు. కాంట్రాక్టర్ల రద్దుతో ఇప్పుడు ప్రాజెక్ట్ తీవ్ర ఆలస్యమవుతుందన్నారు.