యువకుని వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

Suicide
Suicide

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఈ నెల 12న ఇంటి దగ్గర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఓ యువకుడు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు..చనిపోయే ముందు తల్లికి ఆ యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేది తెలియారాలేదు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల వారు కోరుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/