ఏపి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర?

stephen ravindra
stephen ravindra

అమరావతి: ఏపి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా స్టీఫెన్‌ రవీంద్ర నియమితులైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్‌ రేంజ్‌ ఐజిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి రీలీవ్‌ కావడానికి ఇంకా 15 రోజులు పట్టవచ్చని సమాచారం. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సియంగా ఉన్నపుడు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేయడంతో పాటు, వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. రాయలసీమలో చాలా ఏళ్లు పనిచేసిని ఆయనకు మావోలను, ఫ్యాక్షనిస్టులను కట్టడి చేసిన అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/