బోటు వెలికితీత ప్రక్రియ ప్రారంభ0

Kakinada: కచ్చులూరు గోదావరిలో బోటు వెలికితీత ప్రక్రియ ప్రారంభమైంది. బాలాజీ మెరైన్స్‌ సంస్థ బోటు వెలికితీత ప్రక్రియను ప్రారంభించింది. ధర్మాడి సత్యం నేతృత్వంలో 25 మంది సభ్యులతో ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట పేరిట ప్రక్రియను చేపడుతున్నారు. భారీ ప్రొక్లెయిన్‌, ఐరన్‌, నైలాన్‌ రోప్స్‌తో బోటు వెలికితీత పనులు చేపడుతున్నారు. రాయల్‌ వశిష్ట ఆపరేషన్‌కు ఆటంకం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బోటు ప్రమాద స్థలానికి ఎవ్వరినీ వెళ్లనీయకుండా పోలీసులు మోహరించారు. ఇటీవల కచ్చులూరు గోదావరిలో బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. బోటు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతదేహాలను వెలికితీశారు. బోటు వెలికితీస్తే మిగతా 11 మంది మృతదేహాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/