విజయవాడకు చేరిన స్టాలిన్‌

MK Stalin
MK Stalin

విజయవాడ: డీఎంకే అధినేత స్టాలిన్‌ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న స్టాలిన్‌కు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీఎంకే అభిమానులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి స్టాలిన్‌ విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకోనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/