ప్ర‌తి శ‌నివారం స్టాఫ్‌న‌ర్సుల ఆధార్ లింక్

Staff Nursers Aadhar Link programme on Every Saturday

న‌ర్సింగ్ అసోసియేష‌న్ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్‌.కోట‌మ్మ

Tenali: స్టాఫ్ న‌ర్సింగ్ కోర్సు పూర్తి చేసి జిల్లాలోని జిల్లా వైద్య‌శాల‌, ఏరియా వైద్య‌శాల‌లు, క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్స్‌, ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్స్‌, ఎస్ఎన్‌సియు, ఎమ్‌.సి.హెచ్‌, ఎ.ఆర్‌.టి సెంట‌ర్ల‌నో ప‌నిచేస్తున్న స్టాఫ్‌న‌ర్సులు  త‌ప్ప‌నిస‌రిగా త‌మ స‌ర్టిఫికెట్ల‌ను ఆధార్ లింక‌ప్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మం తెనాలి జిల్లా ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 9గంట‌ల నుండి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్టు న‌ర్సింగ్ అసోసియేష‌న్ స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎస్‌.కోట‌మ్మ తెలియ‌జేశారు. కావున ఈ అవ‌కాశాన్ని ఉప‌యెగించుకోవాల‌ని కోరారు.*