శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు విడుదల

ఆన్‌ లైన్‌లో రేపటి నుండి ప్రారంభం

tirumala temple
tirumala temple

తిరుమల: తిరుమలలో రేపటి నుండి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కళ్యాణోత్సవ సేవలో ఆన్ లైన్ లో భక్తులు పాల్గొనున్నారు. ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ స్పష్టం చేసింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/