నార్కో అనాలసిస్‌ పరీక్షకు సిద్దమే!

srinivasa rao
srinivasa rao

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌పై 2018, అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనావాస్‌ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తాను జగన్‌ అభిమానినని, ఆయనపై తాను ఉద్ధేశ్య పూర్వకంగా దాడి చేయలేదని, నార్కో అనాలసిస్‌ టెస్ట్‌కు కూడా సిద్ధమని శ్రీనివాస్‌ తేల్చిచెప్పారు. తనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదని నిందితుడు పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/