తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లంక ప్రధాని

Sri Lankan PM Mahinda Rajapaksa
Sri Lankan PM Mahinda Rajapaksa

తిరుపతి: శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుమారుడు యోషిత రాజపక్స, ఆ దేశ మంత్రి ఆర్ముగన్‌ తొండమాన్‌ తో కలిసి మంగళవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని బృందానికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పడికావలి నుండి ధ్వజ మండపం వరకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసిన కదిలే పైకప్పు గురించి ప్రధానికి ఈఓ వివరించారు. అనంతరం శ్రీలంక ప్రధాని
బృందం అష్టదళ పాదపద్మారాధన సేవలో, విఐపి బ్రేక్‌ లో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక ప్రధాని
బృందం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత టిటిడి ఈవో, జెఈవో కలిసి తీర్థప్రసాదాలను అందించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/