నిన్నటి ఘటనపై క్రిమినల్‌ కేసు పెట్టండి

tammineni sitaram.jpg
tammineni sitaram

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఆవరణలో గురువారం జరిగిన ఘటనపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆవరణలో నిన్న భద్రాతా సిబ్బందిని బెదిరిస్తూ, దూషిస్తూ టిడిపి సభ్యులు వ్యవహిరించిన తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం శుక్రవారం అసెంబ్లీలో స్పందించారు. నిన్న జరిగిన ఘటనలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని మార్షల్స్‌ను స్పీకర్‌ ఆదేశించారు. అసెంబ్లీ గేటు వద్ద నిన్న చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు బయటివారు కూడా ఉన్నారన్న విషయం వీడియోల్లో స్పష్టమైందన్న స్పీకర్‌, వారిని గుర్తించేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలని మార్షల్స్‌్‌కు సూచించారు. శాసన సభ ఆవరణలో నిన్న జరిగిన ఘటనలు అత్యంత దురదృష్టకరమైనవని, అసెంబ్లీ రక్షణ నిమిత్తం నియమించబడిన మార్షల్స్‌తో దురుసుగా ప్రవర్తించడం క్షమార్హం కాదని స్పీకర్‌ స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/