కన్నా లక్ష్మీనారాయణను కలిసిన సోము వీర్రాజు

కొత్త చీఫ్ కు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చిన కన్నా

kanna-lakshminarayana-somu-veerraju

అమరావతి: రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను సోము వీర్రాజు కలిశారు. తాను ఇటివలే ఏపి బిజెపి చీఫ్ గా బాధ్యతలు అందుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వక భేటీ అయ్యామని సోము వీర్రాజు ట్విట్టర్ లో వెల్లడించారు. గుంటూరులోని కన్నా నివాసానికి వెళ్లానని సోము తెలిపారు. కాగా, కొత్త బిజెపి చీఫ్ ను కన్నా తన నివాసంలో సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు తన ఇంట్లోనే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్టు తెలిసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/