అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

road accident
road accident

తనకల్లు: అనంతపురం జిల్లాలో తనకల్లు, నల్లచెర్వు మండలాల సమీపంలోని 42వ నెంబరు జాతీయ రహదారిపైఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు, లారీ ఢీకొన్నాయి.కుక్కంటి క్రాస్‌ నుంచి ప్రయాణికులతో కదిరికి వెళ్తున్న మినీ బస్సు తనకల్లు మండలం పరాకువాండ్లపల్లి క్రాస్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతుల్లో చాలా వరకు తనకల్లు మండలానికి చెందిన వారుగా గుర్తించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/