వివేకా మృతిపై సిట్‌ ఏర్పాటు

vivekanandareddy
vivekanandareddy


కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు కడప ఎస్పి రాహుల్‌దేవ్‌ శర్మ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పి ఆదేశాల మేరకు అదనపు ఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ సిట్‌ ఏర్పాటైంది. దీని విశ్లేషించడానికి ఫోరెన్సిక్‌ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని ,ఘటనాస్థలిని క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. విచారణలో ఎవరి పాత్ర ఉన్నదని తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.