శ్రీవారిని దర్శించుకున్న సమంత

samantha
samantha

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీ నటి సమంత, దర్శకురాలు నందినీరెడ్డి ఈరోజు దర్శించుకున్నారు.ఈ సంద‌ర్భంగా వారు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. తన కొత్త చిత్రం ‘ఓ బేబీ’ సూపర్ హిట్ కావాలని స్వామిని మొక్కుకున్నట్టు సమంత వ్యాఖ్యానించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/