టిడిపికి సాధినేని యామిని రాజీనామా

sadineni yamini
sadineni yamini

అమరావతి: ఆధ్రప్రదేశ్‌లో టిడిపి అధికార ప్రతినిధి సాధినేని యామిని రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు వల్లనే రాజీనామ చేశానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను టిడిపి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యామిని పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. పవన్‌ కళ్యాణ్‌ మరియు కేంద్ర ప్రభుత్వంపై వేసిన సెటైర్లతో ఒక్కసారిగా హైలెట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోరా పరాజయం తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గత కొంత కాలంగా ఆమె పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో..యామిని త్వరలోనే కాషాయా కండువా కప్పుకుంటారని, ఇప్పటికే ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణను కలవడంతో…బిజెపిలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/