గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నియామక పరీక్షలు

Candidates In Exam Hall(File)
Candidates In Exam Hall(File)

Amaravati: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నియామక పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ఉద్యోగాల నియామకానికి రాత పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 21,69,719 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా 5,314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించని కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపారు. హాల్‌ టికెట్లు, ఆధార్‌, ఏదైనా గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు.