శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు

Tirumala Temple
Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు 26 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నడకదారి గుండా వచ్చే భక్తులకు, టైం స్లాట్‌ టోకెన్‌ దర్శనానికి అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ కారణంగా అన్ని రకాల క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లతో పాటు ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/