టిడిపి మాజీ ఎంపీకి వరుస షాక్‌లు

J. C. Diwakar Reddy
J. C. Diwakar Reddy

అనంతపురం: టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రవాణాశాఖ అధికారులు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై సోదాలు నిర్వహించగా తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఆరు జేసీ ట్రావెల్స్‌ బస్సులు దొరికాయి. ఇంకా సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో అధికారులు బస్సుల్ని సీజ్‌ చేశారు. గడిచిన పది రోజుల్లో జేసీకి చెందిన ట్రావెల్స్‌ను సీజ్‌ చేయడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఇంటర్‌ స్టేజ్‌్‌ క్యారియార్‌ పర్మిట్లలో అక్రమాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య 36 బస్సులు..18 కాంట్రాక్టు బస్సులను సీజ్‌ చేయగా కొన్నింటిపై కేసులు నమోదు చేశారు. కాగా వారం రోజుల క్రితం జేసీ దివాకర్‌ రెడ్డి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు నేతల్ని సీఎం టార్గెట్‌ చేసుకున్నారని…దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 80 బస్సులు సీజ్‌ చేశారని జేసీ దివాకర్‌ రెడ్డి జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/