వైఎస్సార్‌ ‘కాపరి బంధు ‘

మరో వినూత్న పథకం ప్రారంభం

గొర్రెలు, మేకల కాపరుల బ్యాంకు ఖాతాలకు రూ.14కోట్లు జమ

Another innovative scheme YSR Kapari Bandhu

అమరావతి: రాష్ట్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మరో వినూత్న పథకాన్ని అమలులోకి తీసుకుని వచ్చారు.వైఎస్సాఆర్‌ కాపరి బంధు పథకంగా దీనికి నామకరణం చేసారు.

ఈ నూతన పథకానికి సంబంధించిన విధి,విధానాలు, ఇతర మార్గ్గదర్శకాలను ప్రభుత్వం తాజా ఉత్త్తర్వుల్ల్లో వెల్ల్లడిం చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆయనకు పలువురు గొర్రెలు,మేకల కాపరులు తమ సమస్యలు విన్నవించారు.

వారి ప్రయోజనాలకు ప్రత్యేక పథకాన్ని అమలులోకి తీసుకుని వస్త్తామని ఆయన అప్పట్లో వాగ్ద్దానం చేసారు.

ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని గొర్రెల కాపరులు, కాపరుల సహకార సంఘాల అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలుసు కున్నారు.

వారి నుంచి గొర్రెల పెంపకానికి సంబంధించిన పూర్తి సమాచా రాన్ని,వారి జీవనస్దితి గతులను ముఖ్యమంత్రి జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

వారి కోసం ప్రత్యేక ఆర్దిక సహకార పథకాన్ని అమలులోకి తీసుకుని వస్తామని ఆయన వెల్లడించారు.ఆ దిశలో ప్రభుత్వం కార్యచరణ చేపట్టిందని వారికి వివరించారు.

ఈ పథకం ద్వారా ఆర్దిక సహకారంతో పాటు రాయితీపై గొర్రెలకు రోగాల నియంత్రణ ప్రధానంగా నట్ట నివారణ చర్యలు, ఇతర వైద్యసేవలకు ప్రభుత్వం సహకారం అందిస్త్తుందని ఆయన ప్రకటించారు.

ఈ క్రమంలో ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్‌సీడీసీ సహకా రంతో గొర్రెల కాపరులకు ఆర్ద్దిక చేయూతను ఇచ్చేందుకు సన్నద్ద్దమైంది.గొర్రెల కాపరులకు గోర్రెల పెంపకం యూనిట్ల్లుకు రుణాలను అందజేస్త్తుంది.

ఇందులో 30శాతం వరకు ప్రభుత్వం రాయితీని అందజేస్త్తుంది.20 గొర్రెలు,ఒక పోట్ట్టేలును యూనిట్ట్టుగా చేసి,రూ.1.50లక్షలు ఆర్థిక చేయూతను అందిస్త్తుంది,

తద్వారా ఏడాదికి 12,500మందికి చొప్పున నాలుగు సంవత్సరాలకు కలిపి 50వేలమందికి ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని కలుగ చేస్త్తారు.ఈ పధకం అమలుకు ఇప్పటికే ఎన్‌సీడీసీ రూ.200కోట్లు కేటాయించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/