మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో చోరీ

kodela-House
kodela-House

సత్తెనపల్లి: ఏపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు. గేటు వద్ద ఉన్న వాచ్‌మన్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా తోసేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కోడెల శివప్రసాద్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు ఆ నివాసం వద్ద ఉన్న సిబ్బంది తెలిపారు. మరికాసేపట్లో ఆయన కూడా సత్తెనపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్‌ గుంటూరు, సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయాల్లో ఉంది. దీనిని ఇవాళ అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకునేందుకు వెళ్లనున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/