ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

road accident
road accident

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆ చిన్నారిని కావలి పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. వీరు తెలంగాణలోని కరీంనగర్ మంకమ్మతోట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. కారులో కరీంనగర్ నుంచి తిరుపతి వెళుతుండగా మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/