తిరుమల ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం

road accident
road accident

చిత్తూరు: తిరుమల ఘాట్‌ రోడ్డులో ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌ రోడ్డు 34 మలుపు వద్ద బైక్‌ను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/