ఆగిన లారీని ఢీకొన్న కారు, ఐదుగురు మృతి

road accident
road accident


రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఉదయం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. బాధితులు అచ్చంపేట నంచి తిరుపతికి వస్తుండగా గురవరాజుపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనండంతో ఈప్రమాదం జరిగింది. బాధితులను చికిత్స నిమిత్తం తిరుపతిలో రుయా ఆసుపత్రికి తరలించారు. రేణిగుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/