క్షేత్ర స్థాయిలో సమీక్షించండి

తెలంగాణకు కిషన్‌రెడ్డి, ఏపి కి నిర్మలా సీతారామన్‌.. బాద్యతలు అప్పగించిన మోది

kishan reddy
kishan reddy

దిల్లీ: దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ విదించిన విషయం తెలిసిందే. అయినప్పటికి దేశంలో కరోనా విస్తరణ మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సమీక్షీంచే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులకు అప్పగించింది. తెలంగాణలోని 33 జిల్లాల బాధ్యతను కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్‌ రెడ్డికి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల బాధ్యతలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు అప్పగించారు. వీరు జిల్లాల ఉన్నతాధాకారులతో చర్చించి ఎప్పటికపుడు నివేదికలను తయారుచేయనున్నారు. ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రజలకు, మరియు ప్రభుత్వాలకు తగిన సుచనలు ఇవ్వాలని మంత్రులను మోది ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/