పోలవరం రివర్స్‌ టెండర్లుకు నోటిఫికేషన్ జారీ

Polavaram project
Polavaram project

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం రూ. 4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభంచింది. ఇందులో హెడ్ వర్క్ పనులకు రూ. 1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టు పనులకు రూ. 3,100 కోట్ల అంచనాలతో టెండర్ల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 201516 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో అంచానాలను భారీగా పెంచారని ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ కేంద్ర జల వనరుల శాఖ చేసిన సూచనలను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/