ఎపీలో కొత్తగా భూమి శిస్తు విధానం

land
land

అమరావతి: ఎన్టీఆర్‌ హయంలో రద్దయిన భూమి శిస్తు విధానాన్ని వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు భూమి శిస్తు వసూలుకు రెవెన్యూమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేస్తోంది. భూమి శిస్తు ద్వారా ఆదాయం పొందాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, భూములపై యాజమాన్య హక్కులకు భరోసానిచ్చేందుకు ఇది అవసరమని రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. భూమి శిస్తు విధానం ద్వారా ఎకరానికి రూ.50 చెల్లిస్తే ర్తెతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని దీన్ని ఆదాయవనరుగా చూడటం లేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదించి ఆయన ఆమోదించాక భూరికార్డుల స్వచ్చీకరణ అనంతరం శిస్తు విధానం అమలు చేస్తామని వివరించారు. కాగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రతి ఏడాది ఈ-జమాబందీ నిర్వహించాలన్న ప్రతిపాదనను సమావేశంలో అంగీకరించారు.

తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:
/https://www.vaartha.com/news/national/