చంద్రగిరి:ఏడు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌

Voters Q Line
Voters Q

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్‌ బూత్‌లలో  రీపోలింగ్‌ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని కమ్మపల్లి 321వ పోలింగ్‌ బూత్‌, పులివర్తివారిపల్లి (పాకాల) 104వ పోలింగ్‌ బూత్‌, కొత్తకండ్రిగ (రామచంద్రాపురం) 316వ పోలింగ్‌ బూత్‌, కమ్మపల్లి (రామచంద్రాపురం) 318వ పోలింగ్‌ బూత్‌, వెంకటరాంపురం (రామచంద్రాపురం) 313వ పోలింగ్‌ బూత్‌, కుప్పంబాదూరు, కాలేపల్లిలలో ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.