పెరిగిన ఉల్లి ధరలు.. క్వింటాల్ కు రూ.12,510లు

కర్నూల్ మార్కెట్ లో ఈరోజు మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర

Onions
Onions

కర్నూలు: ఉల్లిధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కిలో ఉల్లి పాయలు ధర వంద రూపాయలు దాటింది. కర్నూలు మార్కెట్లో ఈ రోజు మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్ఠంగా రూ.12,510 పలికింది. వినియోగదారులకు రాయితీపై ఉల్లిని అందిచేందుకు రైతు బజార్లలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో ఉల్లి నిల్వలు కరువైయ్యాయి. కర్నూలు మార్కెట్ కు గతంలో రోజుకు 5వేల నుంచి 6వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. మరోవైపు ప్రజలకు రాయితీపై ఉల్లి సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం అధికారులకు సూచించడంతో… మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారరులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/