జగన్‌పై ప్రశంసలు కురిపించిన టిడిపి నేత

  • నవరత్నాలు పథకానికి నిధుల కొరత ఎక్కువగా ఉంది
rayapati sambasiva rao
rayapati sambasiva rao

తిరుమల: టిడిపి మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఏపి సిఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. నవరత్నాలు పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని… రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త టెండర్లను పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని అన్నారు. తాను ఏ పార్టీలో చేరబోతున్నాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

ఈరోజు తిరుమల వెంకన్నను రాయపాటి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/