స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహిస్తున్నారు

nimmala ramanaidu
nimmala ramanaidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సమావేశాలు రెండో రోజూ వాడివేడిగా జరుగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరపై చర్చించాల్సిందిగా పట్టుబట్టిన టిడిపి సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ ఆఫీసు కాదని మందిలించారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు వెళ్లే ముందు రైతులకు గిట్టుబాటు ధరలపై టిడిపి నిరసన తెలిపింది. కాగా టిడిపి సభ్యులు స్పీకర్‌ తీరుకు నిరసనగా సభ నుంచి వౌకౌట్‌ చేశారు. అనంతరం మీడియాతో టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ..స్పీకర్‌ తమ్మినేని సీతారం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విపక్షనేత చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు ఎందుకు చేయడం లేదని..రూ.8వేల కోట్లతో ధరల స్థీరీకరణ చేస్తామని అన్న సీఎం మాటలు ఏమయ్యాని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/