రేపటి నుంచి రాజన్న బడిబాట

rajanna badibata
rajanna badibata


విజయవాడ: కృష్టాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విద్యాశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులుపెంచడం, ప్రైవేటులో ఫీజుల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
2024 నాటికి సమగ్ర విద్యా విధానం అందించాలన్నదే లక్ష్యమన్న మంత్రి..ప్రతి పనిని గణాంకాలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. బడిమానేసే వారి సంఖ్య తగ్గాలని, విద్యార్ధుల శాతం పెరిగేలా డిఈఓలు, ఎంఈఓలు పనిచేయాలని సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న రాజన్న బడిబాట ఒక పండుగలా నిర్వహించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/