అచ్చెన్నాయుడు, రాజకుమారిల అరెస్ట్‌

Rajakumari, Achem Naidu Arrest
Rajakumari, Achem Naidu Arrest

Amaravati: ఉండవల్లిలోని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చలో ఆత్మకూరుకు బయల్దేరిన అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు చంద్రబాబు నివాసం వద్ద అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో అచ్చెన్నాయుడు, నన్నపనేని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చలో ఆత్మకూరును అడ్డుకునేందుకు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మరికొందరు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.