నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించండి

అవసరమైతే జైలుకు పంపేందుకు కూడా వెనకాడొద్దు
అక్టోబరు 15 నుంచి రైతు భరోసా

y s jagan
y s jagan

అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని ఏపి సియం జగన్‌ తన నివాసంలో వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా జగన్‌ మాట్లాడుతూ..అక్టోబరు 15 నుంచి రైతు భరోసాను ప్రారంభిస్తామని, రైతులకు రూ. 12,500 నగదు ఇస్తామని, అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నామని తెలిపారు. నకిలి విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు కూడా వెనకడుగు వేయవద్దని , విత్తన చట్టం తేవాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ జరగాలన్నారు. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని సూచించారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా సాయమందిస్తామని తెలిపారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/