ఏపిలో నేడు ‘రైతు భరోసా’ నగదు బదిలీ

49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు నగదు జమ

Rythu

అమరావతి: ఏపిలో ఈరోజు ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పిఎం కిసాన్‌’ పథకం కింద రైతులకు నగదు బదిలీ కానుంది. తొలివిడతలో భాగంగా గత నెలలో ఒక్కో కుటుంబానికి రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 875 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి రూ. 5,500 బ్యాంకుల్లో పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ. 7500 జమ చేసినట్టు అవుతుంది. ఈ ఉదయం సిఎం క్యాంప్‌ కార్యాలయంలో నగదు జమను సిఎం జగన్ ప్రారంభించనున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/