రేపు తెలుగు రాష్ట్రాలో అక్కడక్కడా వర్షాలు

RAIN
RAIN

విశాఖపట్నం: రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి, దీంతో ఉక్కపోత, వేడిమికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏపి, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాసింత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/