ఏపి తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు

heavy rains
heavy rains

హైదరాబాద్‌: బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాల పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపిలో గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరిత ద్రోణి కొనసాగుతుంది. ఈ ఆవర్తనం కారణంగా రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా తెలంగాణలో పలు చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయని, నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైతులు చేతికి అంది వచ్చిన పంట నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/