పాక్షికంగా దెబ్బతిన్న ప్రమాణస్వీకారం వేదిక

vijayawada indira gandhi municipal stadium
indira gandhi municipal stadium

విజయవాడ: బుధవారం అర్ధరాత్రి విజయవాడలో భీకర గాలులతో కూడిన వర్షం, ఈదురు గాలులకు నగరంలోని కొన్న చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వేదికపైన వేసిన పరదాలు పూర్తిగా ఎగిరిపోయాయి. వర్షం కారణంగా ప్రాంగణమంతా బురదమయంగా మారింది. రాత్రి 1.30 గంటలకు గాలులు, వర్షం తెరిపి ఇవ్వగానే పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. మైదానంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/