ఎస్‌విబిసి ఛైర్మన్‌ పదవికి రాఘవేంద్రరావు రాజీనామా

raghavendra rao
raghavendra rao

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్‌విబిసి) చైర్మన్‌ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారన్న విషయం తెలిసిందే. టిటిడి బోర్డు మీటింగ్‌ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలోరు బోర్డు సభ్యులు రాజీనామాలు చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/