పీవీ సింధును సన్మానించిన ఏపీ గవర్నర్

PV Sindhu with Governer
PV Sindhu with Governer

Amaravati: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరించందన్‌ను కలిశారు. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు సింధు వెళ్లారు. ఈ సందర్భంగా సింధుతో పది నిమిషాలపాటు గవర్నర్ ముచ్చటించారు. అనంతరం సింధును గవర్నర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, సింధు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.