శ్రీశైలం ఘాటీలో లోయలో పడిన టూరిస్ట్ బస్సు

bus accident
bus accident

కర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిపోయిన ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడు నుంచి శ్రీశైలానికి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఒకటి బయలు దేరింది. ఆ బస్సు శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.