ఏప్రిల్ 14వరకు చర్చిల్లో ప్రార్థనలు నిషేధం

కలెక్టర్  ఆదేశాల మేరకు  నిర్ణయం

Church

Srikakulam: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలోని అన్ని చర్చిలలోనూ ఏప్రిల్ 14వరకు సామూహిక ప్రార్ధనలను  నిషేధిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యం.అన్నపూర్ణమ్మ తెలిపారు.

ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఆర్ధిక సంస్థ మేనేజింగ్ డైరక్టర్ , జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు  ఈ నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/