ప్రకాశం బ్యారేజీ పై వాహన రాకపోకల నిషేధాజ్ఞలు

Prakasam Barrage
Prakasam Barrage

విజయవాడ: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో, బ్యారేజీ పరిస్థితి ప్రమాదకరంగా తయారైంది. నిండుకుండలా మారిన బ్యారేజీ నుంచి గేట్లన్నింటినీ ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్యారేజీపై వాహన రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించారు. బ్యారేజీ బలహీనంగా ఉందంటూ ప్రభుత్వం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఫోర్ వీలర్స్, ఆటోలు బ్యారేజీ మీద నుంచి వెళ్లరాదంటూ ఆంక్షలను విధించారు. ఈ వాహనాలను అనుమతిస్తే ప్రకంపనలతో బ్యారేజీకి ఇబ్బంది కలగవచ్చని అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీకి భారీ మొత్తంలో నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలను తీసుకున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/