ఐపీఎస్‌ అధికారుల బదిలీల తీర్పు వాయిదా

AP High Court
AP High Court

అమరావతి: ఏపిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై వాదనలు హైకోర్టులో ముగిశాయి. హైకోర్టు ఈ తీర్పును వాయిదా వేసింది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 28(ఏ) పరిధిలోకి రాని అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. కేరళ, మద్రాసు హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను ఏజీ ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ బదిలీల్లో ఒకరి బదిలీని రద్దు చేస్తూ జీవో 720 తెచ్చారని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే సెక్షన్ 28 (ఏ) పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాబిలో డీజీ పేరును ప్రభుత్వమే ఇచ్చిందని ఈసీ తరపున లాయర్ వాదించారు. దీనికి ఏజీ జవాబిస్తూ పొరపాటున ఇంటెలిజెన్స్ డీజీ పేరును ఇచ్చామని వివరణ ఇచ్చారు. ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తే డీజీ విషయంలోనే ప్రభుత్వానికి ఎందుకంత అభ్యంతరం అని ఈసీ తరపు న్యాయవాది ప్రశ్నించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/