వివేకానంద రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం

vivekanandareddy
vivekanandareddy


కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం జరిగిన తర్వాత కాని ఏం జరిగిందో ఒక అవగాహనకు రాలేము. బాత్రూమ్‌లో రక్తపు మరకలు ఉన్నట్లు , మృతిపై అనుమానాలున్నాయని వైఎస్‌ వివేకానంద రెడ్డి పీఏ ఫిర్యాదు చేశారని పేర్కోన్నారు. ఐపిసి 175 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/