ఓట్ల పండగ నేడే

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఉదయం 7 గం.నుంచి సా.5గం.వరకు పోలింగ్‌
మొత్తం ఓటర్లు 3,93,45,717
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 45,920

Voters

విజయవాడ: నేడు ఎన్నికల పోలింగ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. అధికారులు పోలింగ్‌ ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఎన్నికల సజావుగా జరిగేందుకు ఈసీ అన్ని చర్యలు చేపట్టింది. విధులు నిర్వహణకు అధికారులు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్‌ భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో మరింత గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంది.
45,920 పోలింగ్‌ కేంద్రాలు
ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీలోని 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్ధానాలకు టీడీపీ, వైసీలు పోటీ చేస్తున్నాయి. జనసేన 137 అసెంబ్లీ స్ధానాలకు, 16 ఎంపీ స్ధానాలకు పోటీ పడుతోంది. జనసేన కూటమిలో ఉన్న బీఎస్పీ 13 అసెంబ్ల్లీ, 3ఎంపీ స్ధానాలకు, సీపీఎం 7, సీపీఐ 7 అసెంబ్లీ స్ధానాలతో పాటు రెండేసి ఎంపీ స్ధానాలకు పోటీకి దిగాయి. బీజేపీ 173 అసెంబీ, 24 ఎంపీ స్ధానాలకు, కాంగ్రెస్‌ 174 అసెంబ్లీ, 25ఎంపీ స్ధానాల్లో అభ్యర్ధులను బరిలో దింపింది. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు 1249అభ్యర్ధులను బరిలోకి దింపారు. ఎంపీ స్ధానాల్లో స్వతంత్రులు 193మంది బరిలో ఉన్నారు.

Polling in Andhra pradesh
Women Voters

ఓటర్ల సంఖ్య 3,93,45,717
రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 93లక్షల 45వేల ఏడువందల పదిహేడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కు వినియో గించుకోనున్నారు.56వేల మంది పైచిలుకు సర్వీసు ఓటర్లు, 4 లక్షల మంది వరకూ పోస్టల్‌బ్యాలెట్‌ను వినియోగించు కున్నారు. పురు షులు 1,94,62,339 మంది, మహిళా ఓటర్లు 1,98,79, 421మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం 13జిల్లాల్లో ఓటర్లపరంగా అగ్రస్ధానంలో తూర్పుగోదావరి నిలిచింది.ఇక అత్యల్పంగా విజయనగరం జిల్లాలో నమోదు అయ్యాయి.
ఎన్నికల విధుల్లో 3లక్షలు సిబ్బంది
ఎన్నికల విధుల్లో 3లక్షల ఎన్నికల సిబ్బందిని ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఎన్నికల విధుల్లో ఒక లక్షా 20వేల మంది పోలీస్‌ బలగాలుబందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలు, బలగాల రవాణాకు వినియోగించే 7,600బస్సులు ఏర్పాటు చేశారు.
తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నా అభ్యర్ధులు
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్ధానాల్లో 2,118 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. 25ఎంపీ స్ధానాలకు 319మంది పోటీలో ఉన్నారు. గుంటూరు అసెంబ్లీ స్ధానం నుండి అత్యధికంగా 34మంది పోటీలో ఉన్నారు. ఆ తరువాత స్ధానంలో మంగళగిరి నుండి 32మంది పోటీ చేస్తున్నారు. ఇచ్ఛాపురం, రాజాం, అముదాలవలస నియోజకవర్గాల్లో 6మాత్రమే బరిలో ఉన్నారు. ఇక నంద్యాల ఎంపీ స్ధానం నుండి అత్యధికంగా 20మంది పోటీ చేస్తుండగా, అత్యల్పంగా చిత్తూరు ఎంపీ స్ధానం నుండి కేవలం 8మంది మాత్రమే బరిలో నిలిచారు.