తలలేని కూతురు మృతదేహంతో తల్లి ఆందోళన

Police Enquiry

Vijayawada: స్థానిక సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో ఈ మధ్యాహ్నం జరిగిన దారుణ హత్యకేసు నగరంలో సంచలనంగా మారింది. ప్రదీప్ అనబడే కిరాతక భర్త తన భార్య తలనరికి తలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి జనాలు కేకలు వేయడంతో తలను బుడమేరులో పడేసి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కాగా ఈ ఉదంతంలో బాధితురాలు మణిక్రాంతి తల్లి.. కూతురు మృతదేహంతో స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. తన కూతురు చావుకు పోలీసులే కారణమని మణిక్రాంతి బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రదీప్ మీద మణిక్రాంతి ఫిర్యాదు చేయడంతో నిన్నటి వరకు జైల్లోనే ఉండగా నిన్ననే బెయిల్ మీద బయటకొచ్చి ఈరోజు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. వీరిద్దరిదీ నాలుగేళ్ళ క్రితం ప్రేమ వివాహం కాగా కొంతకాలంగా గొడవలతో విడాకులకు సిద్ధపడ్డారు. విడాకుల కేసు కోర్టులో చివరి దశకు రాగా ఈరోజు ఈ ఘటన జరిగింది.